ఆశ్వ గురించి తెలుగులో

సంస్థ ఆవిర్భావము:

ప్రార్థించే పెదవులు ఏం కోరుకుంటాయో తెలియదు కానీ, సేవ చేసే చేతులు మాత్రం తోటి వారికి ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాయి. తల్లి జన్మనిచ్చిన బిడ్డకి చేసే సేవలకు ఎప్పుడూ ప్రతిఫలం ఆశించదు, అమ్మ చేతులెప్పుడూ అలసిపోవు. అమ్మ ప్రేమే స్పూర్తిగా, “మానవ సేవే మాధవ సేవ” అని నమ్మి, కుల, మత, వర్ణ, వర్గ తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు అనే నినాదంతో రూపుదిద్దు కొన్న సంస్థే ఈ “అమ్మ స్వచ్ఛంద సేవా సమితి (అశ్వ)”.

అనాథలకు, అవసరార్థులకు ఆపన్న హస్తం అందిస్తూ ఆసరాగా నిలబడుతోంది అమ్మ. ఇక్కడ అమ్మ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు! ఈ సమాజం మాకేమిచ్చింది అని ప్రశ్నించక, సాటి వారికి మేమేమి చేయగలం అనే సేవాతత్పరత కలిగిన ప్రతి వ్యక్తీ అమ్మే ! అటువంటి వ్యక్తులతో నిర్వహిస్తున్న సంస్థే , మన ఈ  “అమ్మ స్వచ్ఛంద సేవా సమితి”.

ASWA కు స్వచ్చంద సేవకులే నిజమైన బలం. మీలోని ప్రతి ఒక్కరూ ASWA విజయానికి కారకులే. మీరు ఉత్సాహంగా పాల్గొనడం, సహకరించడం వల్లనే ఈ ప్రయాణం ‘కల నిజమయ్యిందా’ అన్నంత అద్భుతంగా కొనసాగుతోంది. సకాలంలో మీరు అందిస్తున్న సాయంవల్ల, మీ తెలివైన సూచనల వల్ల, ప్రతి ఏడూ మేము కొత్త ఉరవడితో ప్రగతి పధంలో దూసుకుని పోతున్నాము. అవసరంలో ఉన్న వ్యక్తులకు తగిన సహాయం చెయ్యాలన్నదే మా అంతిమ లక్ష్యం. తీర్చడమే కాదు, నడవడికను తీర్చిదిద్ది, సమాజం లో మనం ఉన్నతులుగా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తుంది అమ్మ, అందుకే ఈ లోకంలో మన తొలి గురువు అమ్మ,

అనాధలకు, అవసరార్థులకు ఆపన్న హస్తం అందిస్తూ ఆసరాగా నిలబడుతోంది అమ్మ. ఇక్కడ అమ్మ అంటే ఒక్కరు కాదు, ఈ సమాజం మాకేమిచ్చింది అని ప్రశ్నించక, సాటివారికి మేమేమిచేయగలం అనే సేవా తత్పరత కలిగిన వ్యక్తులు నిర్వహిస్తున్న సంస్థ. అదే మన ఈ  “అమ్మ స్వచ్ఛంద సేవా సమితి”.

వెయ్యి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్న విధంగా, కొత్త సంవత్సరంలో ఏదైనా మంచిపని చేయాలని భావించి, 2008 జనవరి 1 వ తేదీన శివానంద ఆశ్రమాన్ని సందర్శించిన 15 మంది మిత్రుల మానసపుత్రికే ఈ  అమ్మ.  ఆశ్రమ సందర్శన ప్రేరణతో 2008 ఏప్రిల్ 27న అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ పురుడు పోసుకొంది. అనుకున్నదే తడవుగా వివిధ సేవా సంస్థలను సందర్శించి వాటి పనితీరును అధ్యయనం చేసి, ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకొని, 15 మంది సభ్యులతో మొదలైన నాటి ప్రయాణం, ఎంతోమంది దాతల సహకారంతో, ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని,  నేడు 5౦౦ మందికి పైగా సభ్యులతో అప్రతిహతం గా కొనసాగుతోంది.

ఈ సంస్థ సభ్యులందరూ వారికున్న సమయంలో తీరిక చేసుకొని స్వచ్ఛందంగా, నిస్వార్ధంగా సమాజ సేవ కోసం వెచ్చిస్తున్నవారే

మొత్తం సమాచారం కొరకు